రేపటి నుండి తెలంగాణలో కోవిడ్ బూస్టర్ డోస్
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
- బూస్టర్ డోస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం
- అందుబాటులో 5 లక్షల డోసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లోను మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన కేసులు... సోమవారం మాత్రమే కాస్త క్షీణించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం నిన్న 7,633 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 61,233గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోస్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బుధవారం (ఏప్రిల్ 19) నుండి రాష్ట్ర వ్యాప్తంగా 'కోర్బె వాక్స్' కరోనా వ్యాక్సీన్ ను బూస్టర్ డోస్ గా అందించనున్నట్లు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు వ్యాక్సీన్ తీసుకోవాలని సూచించారు. మొదటి, రెండో డోసులు కోవాగ్జిన్, కొవిషీల్డ్.... వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా 'కోర్బె వాక్స్' వ్యాక్సీన్ ను తీసుకోవచ్చునని తెలిపారు.
కొంతకాలంగా వ్యాక్సీన్ ల కొరత కారణంగా బూస్టర్ డోసుల పంపిణీ నిలిచిపోయింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యాక్సీన్ తయారీ సంస్థ 'బయోలాజికల్ ఈ' నుండి 5 లక్షల 'కోర్బె వాక్స్' డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.