పరిస్థితి అక్కడి దాకా తెచ్చుకోవద్దు.. సీఎస్‌కే బౌలర్లకు సెహ్వాగ్ హెచ్చరిక

  • సీఎస్‌కే బౌలర్లలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న క్రమశిక్షణ లోపం
  • ఈ ఐపీఎల్ సీజన్‌లో పరిమితికి మించి నో బాల్స్, వైడ్స్ డెలివరీ
  • సీఎస్‌కే బౌలర్లకు సెహ్వాగ్ ఘాటు వార్నింగ్
  • కెప్టెన్ ధోనీపై బ్యాన్ పడేదాకా తెచ్చుకోవద్దని ఘాటు హెచ్చరిక
ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అతిగా నో బాల్స్, వైడ్స్ వేయడం టీంకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై టీం కెప్టెన్ ధోనీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘మా టీం బౌలర్లు నో బాల్స్ అస్సలు వేయకూడదు. వైడ్స్ కూడా తగ్గించుకోవాలి. ఎక్స్‌ట్రా డెలివరీల సంఖ్య తగ్గించుకోవాలి. లేకపోతే వారు మరో కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా టీం ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే హెచ్చరిక చేశారు. 

‘‘బౌలింగ్ విభాగం పట్ల ధోని అంత సంతృప్తిగా లేడు. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేశాడు. వైడ్స్, నో బాల్స్ తగ్గించుకోవాలని బౌలర్లకు సూచించాడు. ఇటీవల ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ నో బాల్స్, వైడ్స్ ఎక్కువయ్యాయి. అయితే.. ధోనీపై బ్యాన్ పడేదాకా పరిస్థితి తెచ్చుకోకూడదు’’ అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News