ఉత్కంఠను రేపుతున్న 'విరూపాక్ష' మేకింగ్ వీడియో!

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'విరూపాక్ష'
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల 
  • అంచనాలు పెంచుతున్న అప్ డేట్స్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న అజనీశ్ సంగీతం
సుకుమార్ తన బ్యానర్ ద్వారా తన శిష్యులకు దర్శకులుగా అవకాశాలను ఇవ్వడం వరుసగా జరుగుతూ వస్తోంది. అలా గతంలో తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్ వర్మ దండుకి 'విరూపాక్ష' సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. 

సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, ఒక అడవికి సమీపంలో ఉన్న గిరిజన గూడెం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. క్షుద్ర విద్యలను ఎదిరించి గూడెం ప్రజలను కాపాడే యువకుడిగా ఈ సినిమాలో సాయితేజ్ కనిపించనున్నాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో, మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

చీకట్లో కర్రలు .. కాగడాలు .. లాంతర్లు పట్టుకుని గూడెం ప్రజలు అడవిలోకి పరుగులు పెడుతుండటం, దుష్టశక్తులతో ఒంటరిగా పోరాడటానికి హీరో రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలను చిత్రీకరించిన విధానం చూపించారు. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.


More Telugu News