అవినాశ్ రెడ్డిని ఇవాళ విచారించలేం: హైకోర్టుకు తెలిపిన సీబీఐ
- ఈ సాయంత్రం 4 గంటలకు అవినాశ్ రెడ్డిని విచారించాల్సి ఉన్న సీబీఐ
- అవినాశ్ బెయిల్ పిటిషన్ పై ఇంకా కొనసాగుతున్న వాదనలు
- విచారణపై స్పష్టత కోరిన అవినాశ్ న్యాయవాది
- అవినాశ్ ను రేపు విచారిస్తామన్న సీబీఐ అధికారులు
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సాయంత్రం 4 గంటలకు సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారించాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది.
అయితే, హైకోర్టులో వాదనలు పూర్తి కాకపోవడంతో... అవినాశ్ రెడ్డిని ఇవాళ విచారించలేమని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. రేపు (ఏప్రిల్ 19) ఉదయం 10.30 గంటలకు రావాలని అవినాశ్ రెడ్డికి చెబుతామని వెల్లడించారు. అవినాశ్ రెడ్డిని రేపు విచారిస్తామని వివరించారు.
అంతకుముందు, అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఈ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన విచారణపై స్పష్టత ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ సాయంత్రం విచారణకు వెళ్లేందుకు అవినాశ్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అందుకు సీబీఐ బదులిస్తూ పైవిధంగా స్పందించింది.