డ్వాన్ బ్రావో శిక్షణతో మా బౌలర్లు రాటుదేలుతారు: ధోనీ
- డెత్ ఓవర్ల బౌలింగ్ లో బ్రావో ఓ స్పెషలిస్ట్ అని ప్రకటన
- అతడి శిక్షణతో యువ బౌలర్లలో నమ్మకం పెరుగుతుందన్న ధోనీ
- దూబే విషయంలో తమకు ప్రణాళికలు ఉన్నాయన్న చెన్నై కెప్టెన్
ఐపీఎల్ 2022 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్రధారిగా ఉన్న డ్వాన్ బ్రావో ఈ సీజన్ నుంచి బౌలింగ్ కోచ్ పాత్రలోకి మారిపోయాడు. బ్రావో పాత్రపై చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ నిన్నటి మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎలా చేయాలో యువ బౌలర్లకు బ్రావో శిక్షణ ఇస్తాడని చెప్పాడు.
‘‘యువ బౌలర్లకు అది (చివరి ఓవర్లలో బౌలింగ్) కష్టమైనది. అయినా కానీ, వారు ఎంతో కష్టపడుతున్నారు. ఈ విషయంలో బ్రావో స్పెషలిస్ట్. అతడి శిక్షణలో యువ బౌలర్లు నమ్మకాన్ని పెంచుకుంటారు. ఇది టీమ్ గేమ్. కోచ్, బౌలింగ్ కోచ్, సీనియర్ ప్లేయర్లు వారిని నడిపిస్తారు’’అని ధోనీ తెలిపాడు. స్పిన్నర్లను శివమ్ దూబే ఎదుర్కోవడం పట్ల ధోనీ సంతోషం వ్యక్తం చేస్తూ, పేసర్లను ఎదుర్కొనే విషయంలో మరింత సాధన చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అతడిపై తమకు నమ్మకం ఉందని, ఈ విషయంలో తమకు కొన్ని ప్రణాళికలు ఉన్నట్టు ప్రకటించాడు. అతడు ఆచరణలో చేయగలడని, ఆ విషయాన్ని తమకంటే అతడే నమ్మాల్సి ఉంటుందన్నాడు.
ఆర్సీబీ ఓటమి గురించి మాట్లాడుతూ.. ‘‘220 స్కోరు సాధించాల్సి ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ కొడుతూనే ఉండాలి. ఫాఫ్, మాక్సి కొనసాగి ఉంటే 18వ ఓవర్లోనే విజయం సాధించేవారు. వికెట్ వెనుక నేను దీనిపైనే మదింపు వేశాను. ఫలితం గురించి ఆలోచించకుండా ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాను’’అని ధోనీ చెప్పాడు.