మంచు మనోజ్ - భూమా మౌనిక పెళ్లి వీడియో సాంగ్!
- ఇటీవల జరిగిన మంచు మనోజ్ పెళ్లి
- ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన భూమా మౌనిక
- పెళ్లి వేడుకపై వీడియో సాంగ్ రిలీజ్
- అనంత శ్రీరామ్ రాయగా, అచ్చు రాజమణి ఆలపించిన పాట
ఇటీవల మంచు మనోజ్ - భూమా మౌనిక వివాహం జరిగింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే వీరి ప్రేమకి పునాది వేసిందని అంటారు. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్లో మెరవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. తమ గురించిన ఒక శుభవార్త త్వరలోనే చెబుతానని అక్కడి రిపోర్టర్ లతో మనోజ్ అన్నాడు.
ఆ తరువాత ఆయన మోహన్ బాబును ఒప్పించి భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు.
'ఏం మనసో .. ఏం మనసో' అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటకి అచ్చు రాజమణి ట్యూన్ చేయడమే కాకుండా, ఆయనే ఈ పాటను ఆలపించారు. పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఈ పాటపై కట్ చేశారు. ఆత్మీయుల రాక .. ఇద్దరినీ ముస్తాబు చేయడం .. ఉంగరాలు మార్చుకోవడం .. తలంబ్రాలు పోసుకోవడం .. అరుంధతి నక్షత్రం చూపించడం .. పెద్దల ఆశీస్సులు మొదలైన దృశ్యాలపై ఈ పాట సాగింది.