ఇప్పటికీ రోడ్లపైనే తిరుగుతున్న గొప్ప నటుడు ఆర్. నారాయణమూర్తి: తమ్మారెడ్డి
- ఎర్ర సినిమాలతో పాప్యులర్ అయిన ఆర్. నారాయణమూర్తి
- ఆయన ఎన్నో సూపర్ హిట్లు ఇచ్ఛాడన్న తమ్మారెడ్డి
- సంపాదన సమాజ సేవకి ఉపయోగించాడని వ్యాఖ్య
- తన పద్ధతిని మార్చుకోని గొప్ప వ్యక్తి అంటూ కితాబు
తెలుగు తెరపై ఎర్ర సినిమాలను పరుగులు తీయించిన నటుడిగా .. దర్శకుడిగా ఆర్.నారాయణమూర్తికి మంచి పేరుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి ఆర్ నారాయణమూర్తి గురించి తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు. "తెలుగు సినిమాకి ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి" అని అన్నారు.
"ఆర్. నారాయణమూర్తి విప్లవాన్ని నమ్ముకున్నారు .. విప్లవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమాలను చేస్తూ వచ్చిన ప్రత్యేక్యత ఆయన సొంతం" అన్నారు.
"మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి" అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు" అని చెప్పుకొచ్చారు.