టీడీపీకి ఓటేసే ఒక్క కుటుంబాన్ని వైసీపీ వైపు తిప్పినా చాలు.. మనకు వేలల్లో ఓట్లు: మంత్రి ధర్మాన
- వైసీపీకి ఓటేస్తామని చెప్పేవారితో దేవుడి ఫొటోపై ప్రమాణం చేయించుకోవాలన్న మంత్రి
- ఓటర్లను ఏ,బీ,సీ గా గుర్తించాలని వలంటీర్లకు సూచన
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఉద్యోగాలు పోతాయని వలంటీర్లకు హెచ్చరిక
టీడీపీకి ఓటేసే వారిని గుర్తించి ఒక్క కుటుంబాన్ని వైసీపీ వైపు తిప్పుకున్నా ఎన్నికల్లో మనకు వేలాది ఓట్లు పడతాయని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం టౌన్ హాల్‌లో గత రాత్రి వలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఓటేస్తామని చెప్పే వారితో దేవుడి ఫొటోపై ఒట్టు వేయించుకోవాలని సూచించారు. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తొలుత గుర్తించి వారిని మూడు రకాలుగా విభజించుకోవాలన్నారు. వైసీపీకి ఓటేసే వారిని ‘ఏ’గా, వేయని వారిని ‘బీ’గా గుర్తించాలన్న మంత్రి.. అటూఇటూ కాకుండా గోడ మీద పిల్లిలా ఉండేవారిని ‘సీ’లో చేర్చాలని సూచించారు.
దూరప్రాంతాలకు వెళ్లిన వైసీపీ ఓటర్లను గుర్తించాలని వారి అడ్రస్‌లు సేకరించాలని అన్నారు. ఎవరైనా మాట వినకుంటే కుల పెద్దలతో మాట్లాడించాలన్నారు. ఓట్ల సేకరణ కోసం తుపాకి పట్టిన సైనికుడిలా పనిచేయాలని కోరారు. వలంటీర్లకు మంచి పేరుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఉద్యోగం పోతుందని మంత్రి హెచ్చరించారు.