పాముకాటుతో ఆసుపత్రిలో చేరిన భార్య.. పాముతో వచ్చిన భర్త.. చెప్పింది విని వైద్యుల షాక్!
- ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘటన
- భార్యను కాటేసిన పామును పట్టుకుని సంచిలో వేసుకుని ఆసుపత్రికి వెళ్లిన భర్త
- భయభ్రాంతులకు గురైన వైద్యులు
- ఏ పాము కాటేసిందో తెలిస్తే అందుకు తగ్గట్టు వైద్యం చేయొచ్చనే తెచ్చానన్న మహిళ భర్త
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. పాము కాటుకు గురైన భార్య ఆసుపత్రిలో చేరితే, విషయం తెలిసిన భర్త ఇంటికెళ్లి పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతడు చెప్పింది విని వైద్యులు నోరెళ్లబెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ఉమన్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర-కుష్మా భార్యాభర్తలు. కుష్మా తన ఇంటిని శుభ్రం చేస్తున్నసమయంలో పాము ఆమెను కాటేసింది. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ కుప్పకూలి స్పృహ కోల్పోయింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగువారు వెంటనే స్పందించి అంబులెన్సులో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
తన భార్య పాము కాటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న నరేంద్ర ఆసుపత్రికి కాకుండా నేరుగా ఇంటికెళ్లి భార్యను కాటేసిన పామును వెతికి పట్టుకున్నాడు. ఆపై దానిని సంచిలో వేసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. సంచిలోని పామును చూసిన వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు.
పామును ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తే.. అతడిచ్చిన సమాధానానికి వైద్యులు అవాక్కయ్యారు. ఏ పాము కాటేసిందో తెలిస్తే అందుకు తగ్గట్టుగా వైద్యం చేసే వీలుంటుందన్న ఉద్దేశంతోనే దానిని తెచ్చినట్టు చెప్పడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. కుష్మా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమెకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని అతడికి చెప్పిన వైద్యులు.. పామును అడవిలో వదిలిపెట్టాలని సూచించారు.