ఇలాంటి కెప్టెన్ ఇప్పటివరకు లేడు... ఇక ముందు రాడు: గవాస్కర్
- ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరో చెప్పిన గవాస్కర్
- ఐపీఎల్ లో చరిత్రలో ధోనీ వంటి కెప్టెన్ మరొకరు లేరని కితాబు
- ధోనీ పూర్తిగా డిఫరెంట్ అని వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిపోతాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ధోనీ వంటి కెప్టెన్ ఇప్పటివరకు లేడని, భవిష్యత్తులోనూ రాబోడని వ్యాఖ్యానించారు. గడ్డు పరిస్థితులు అధిగమించడం ఎలాగో చెన్నై సూపర్ కింగ్స్ కు తెలుసని, ధోనీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని గవాస్కర్ కొనియాడారు.
200 మ్యాచ్ లకు సారథ్యం వహించడం చాలా కష్టమైన విషయం అని తెలిపారు. అత్యధిక మ్యాచ్ లలో సారథ్యం వహించడం భారంగా మారుతుందని, సొంత ఆటపైనా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. "కానీ, మహి విభిన్నమైన ఆటగాడు. అంతకంటే విలక్షణమైన కెప్టెన్. ఇలాంటి కెప్టెన్ మరొకరు ఉంటారని అనుకోను" అని గవాస్కర్ వివరించారు.