ఆ సమయంలో కోపం .. కసి పెరిగిపోయాయి: డైరెక్టర్ శ్రీవాస్
- గోపీచంద్ కి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్
- మూడో సినిమాగా రెడీ అవుతున్న 'రామబాణం'
- వెంకీతో ప్రాజెక్ట్ మిస్సయిందన్న శ్రీవాస్
- అందువల్లనే గ్యాప్ వచ్చిందని వెల్లడి
గోపీచంద్ హీరోగా 'లక్ష్యం' .. 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రీవాస్, ఆయన హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఆ సినిమా పేరే 'రామబాణం'. 'సాక్ష్యం' తరువాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని శ్రీవాస్ చేసిన సినిమా ఇది.
తాజా ఇంటర్వ్యూలో శ్రీవాస్ మాట్లాడుతూ ..'సాక్ష్యం' తరువాత అనిల్ సుంకర నిర్మణంలో వెంకటేశ్ హీరోగా ఒక సినిమా చేయవలసి ఉంది. ఆ కథపై నాలుగైదు నెలలు కసరత్తు చేయడం కూడా జరిగింది. ఇక అంతా రెడీ .. షూటింగుకి వెళ్లాడమే తరువాయి అనుకుంటూ ఉండగా వెంకటేశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు" అని అన్నాడు.
"వెంకటేశ్ ముందుగా 'నారప్ప' చేయాలని భావించారు. ఆ ప్రాజెక్టు పైకి ఆయన వెళ్లిపోయారు. అప్పటికప్పుడు మరో హీరో ఎలా దొరుకుతాడు? ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉంటారు. ఇక మరో కథను సెట్ చేసుకోవడం కూడా అంత తేలికగా జరిగే పనేం కాదు. అందువల్లనే గ్యాప్ వచ్చేసింది. ఆ సమయంలో కోపం .. కసి పెరిగిపోయాయి" అని చెప్పుకొచ్చాడు.