శాంసంగ్ ఫోన్లలో ఇక గూగుల్ కనిపించకపోవచ్చు!
- టెక్ రంగంలో చాట్ జీపీటీ సంచలనం
- బింగ్ సెర్చ్ ఇంజిన్ కు చాట్ జీపీటీని జోడిస్తున్న మైక్రోసాఫ్ట్
- బింగ్ వైపు మొగ్గుచూపుతున్న శాంసంగ్
- తన ఫోన్లలో ఇక డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా బింగ్!
- ఆ మేరకు న్యూయార్క్ టైమ్స్ లో కథనం
ఇటీవల టెక్ ప్రపంచంలో చాట్ జీపీటీ సంచలనం సృష్టిస్తోంది. ఆధునికతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు చాట్ జీపీటీ ప్రతిరూపం అని చెప్పవచ్చు. కాగా, చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్ సంస్థ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కు జోడిస్తుండడంతో గూగుల్ కు బింగ్ కు మధ్య పోటీ తీవ్రమైంది.
ఈ నేపథ్యంలో, ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ శాంసంగ్ తన మొబైల్ ఫోన్లలో ఇకపై గూగుల్ స్థానంలో బింగ్ ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఇప్పటివరకు శాంసంగ్ తాను విడుదల చేసిన ఫోన్లలో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు చెందిన యాప్ లను అందించింది. శాంసంగ్ ఫోన్లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ దర్శనమివ్వడం తెలిసిందే.
అయితే, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో గూగుల్ స్థానంలో బింగ్ ను డిఫాల్ట్ గా తీసుకురావడంపై శాంసంగ్ కసరత్తులు చేస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ వివరించింది. అదే జరిగితే గూగుల్ కు 3 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది.