ఇంట్రెస్టింగ్ గా 'జూబ్లీ' (వెబ్ సిరీస్) క్లైమాక్స్!
- అమెజాన్ ప్రైమ్ నుంచి పలకరించిన 'జూబ్లీ'
- భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో రూపొందిన వెబ్ సిరీస్
- ఈ నెల 14 నుంచి మరో 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్
- కథాకథనాలు .. నిర్మాణ విలువలు .. చిత్రీకరణ హైలైట్
- ప్రధానమైన బలంగా నిలిచిన సంగీతం .. ఫొటోగ్రఫీ
'జూబ్లీ' .. 1940 - 50లలో జరిగిన కథగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఆ కాలంలో బాలీవుడ్ సినిమా ఫీల్డ్ ఎలా ఉండేది? కొత్తదనం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? హీరో .. హీరోయిన్స్ మధ్య సంబంధాలు ఆ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపించాయి? ఒకప్పుడు వైభవాన్ని చూసిన సంస్థలు .. స్టూడియోలు ఏ కారణాలుగా కుప్పకూలిపోయాయి? అనే అంశాలపై ఈ వెబ్ సిరీస్ కొనసాగుతూ వెళుతుంది. ఫస్టు పార్టులో 5 ఎపిసోడ్స్ ను వదిలారు. సెకండ్ పార్టుగా ఈ నెల 14న మరో 5 ఎపిసోడ్స్ ను రిలీజ్ చేశారు.
ముంబై లో రాయ్ టాకీస్ కి గొప్పపేరు ఉంటుంది. రాయ్ తన కొత్త సినిమాలో మదన్ కుమార్ ను హీరోగా తీసుకోవాలని అనుకుంటాడు. అయితే మదన్ కుమార్ పై రాయ్ భార్య సుమిత్ర మనసు పడుతుంది. దాంతో రాయ్ తన దగ్గర పనిచేసే వినోద్ ను హీరోగా చేస్తాడు. వినోద్ చేతిలో గాయపడిన మదన్ కుమార్ ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. మదన్ కుమార్ ఛాన్స్ ను కొట్టేసిన వినోద్ పై సుమిత్ర పగ పెంచుకుంటుంది. అతని కెరియర్ ను దెబ్బకొట్టే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది.
జై - నీలోఫర్ జంటగా చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. జై తో పాటు నీలోఫర్ కూడా స్టార్ అవుతుంది. కిరణ్ ను కాదనుకుని నీలోఫర్ ను పెళ్లి చేసుకోవాలని జై అనుకుంటాడు. కానీ ఆమె వినోద్ పంచన చేరుతుంది. హీరోగా జై ఎదుగుదల వినోద్ కి నిద్రలేకుండా చేస్తుంది. నీలోఫర్ తో అక్రమ సంబంధం వినోద్ కొత్త సినిమాపై ప్రభావం చూపుతుంది. ఆ సినిమా కారణంగా రాయ్ మరింత నష్టపోతాడు.
మదన్ కుమార్ ను వినోద్ చంపాడనడానికి ఆధారాలు సేకరించే పనిలో సుమిత్ర నిమగ్నమవుతుంది. ఆ విషయంలో ఆమె ప్రయత్నం ఫలిస్తుందా? తన భార్య తమ సంస్థ నష్టాలను గురించి కాకుండా మదన్ గురించి ఆలోచిస్తుండటంతో రాయ్ ఏం చేస్తాడు? తన పెళ్లి విషయంలో జై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వంటి ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కాలంనాటి పరిస్థితులకు అద్దం పడుతూ, కథాకథనాల పరంగా .. సంగీతం - ఫొటోగ్రఫీ పరంగా .. నిర్మాణ విలువల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది.