ఐఆర్ఐఎఫ్ఎంకు గోల్డ్ గార్డెన్ సర్టిఫికెట్.. ఈ నవంబర్ లో శిక్షణకు రానున్న ఐఆర్ఎంఎస్ తొలి బ్యాచ్
- మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేత
- ఆనందం వ్యక్తం చేసిన ఏడీజీ సింగయ్య
తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ లో ఐఆర్ఐఎఫ్ఎం గోల్డ్ గార్డెన్ అవార్డును సాధించింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తరపున గోల్డ్ గార్డెన్ సర్టిఫికెట్ అవార్డును బండ్లమూడి సింగయ్య IRAS, అడిషనల్ డైరెక్టర్ జనరల్, కె.ఆర్ అభిషేకానందరావు IRAS, డీన్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎం) అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 5 ఎకరాల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న గార్డెన్ కేటగిరీలో ఐఆర్ఐఎఫ్ఎంకు గోల్డ్ గార్డెన్ సర్టిఫికెట్ వచ్చింది. ఐఆర్ఐఎఫ్ఎంకు సర్టిఫికెట్ రావడంపై ఏడీజీ సింగయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఐఆర్ఐఎఫ్ఎం సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. ఇండియన్ రైల్వేస్ అత్యున్నత ఉద్యోగుల శిక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికయ్యే ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ (IRMS) అధికారులు ఇక్కడ శిక్షణ పొందుతారు. IRMS గతంలో IRAS (ఇండియన్స్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) గా ఉండేది. IRIFM సంస్థను తొలిసారిగా జంట నగరాల్లోనే ఏర్పాటు చేశారు.
సువిశాలమైన ప్రాంగణంలో అత్యున్నత వసతులతో ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఇన్స్టిట్యూట్ కు ఈ ఏడాది నవంబర్ లో తొలి IRMS బ్యాచ్ శిక్షణకు వస్తోంది. ఇండియన్ రైల్వేస్ కు చెందిన ఇతర ఉన్నతాధికారులు, సీనియర్ మేనేజ్ మెంట్ అధికారులు, వివిధ రైల్వే విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు కూడా ఇక్కడ ఆర్థిక సంబంధిత విషయాల్లో పలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తారు.