చిరంజీవిగారిని తెరపై చూడగానే టి.కృష్ణ గుర్తుపట్టేశారు: నిర్మాత పోకూరి బాబూరావు

  • సీనియర్ ప్రొడ్యూసర్ గా ఉన్న పోకూరి బాబూరావు 
  • టి.కృష్ణ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చానని వెల్లడి 
  • చిరంజీవి తమకి జూనియర్ అని వివరణ 
  • ఆయన మెగాస్టార్ గా ఎదగడం చూశానంటూ హర్షం
నిర్మాత పోకూరి బాబూరావు పేరు వినగానే, టి.కృష్ణతో కలిసి ఆయన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు గుర్తుకువస్తాయి. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మాది ఒంగోలు దగ్గర ఒక పల్లెటూరు. ఒంగోలు .. ఏలూరులలో నా చదువు కొనసాగింది. నేను .. టి. కృష్ణగారు ఒకే కాలేజ్ లో చదువుకున్నాము .. ఒకే క్లాస్ కూడా" అన్నారు. 

"టి.కృష్ణగారు ముందుగా ఇండస్ట్రీకి వెళ్లారు. ఆయనతో ఉన్న స్నేహం కారణంగా .. ఆయన ప్రోత్సహించడంతో నేను కూడా మద్రాసు వెళ్లాను. ఒక రోజున నేను .. కృష్ణగారు ఇద్దరం కలిసి 'మనఊరి పాండవులు' సినిమాకి వెళ్లాము. తెరపై చిరంజీవిని చూడగానే 'ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను ..' అని కృష్ణగారు అన్నారు. 'నాకైతే గుర్తులేదండీ' అన్నాను నేను. 

ఆ తరువాత కొన్ని రోజులకు కృష్ణగారు నాతో "బాబూరావ్ మొన్న మనం చూసిన సినిమాలోని కుర్రాడు మన కాలేజ్ లోనే చదువుకున్నాడట .. మనకి జూనియర్ అట .. పేరు వరప్రసాద్" అని చెప్పారు. అలా మా కాలేజ్ లో మా జూనియర్ గా ఉన్న చిరంజీవిగారు, ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు. 



More Telugu News