అనుచరులతో కలిసి 10 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరిన అవినాశ్ రెడ్డి
- వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు
- నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న విచారణ
- భారీ కాన్వాయ్‌తో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కడప ఎంపీ
విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ తెల్లవారుజామున అనుచరులతో కలిసి 10 వాహనాల్లో పులివెందుల నుంచి భారీ కాన్వాయ్‌తో ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి గత రాత్రి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది. ఇది ఐదోసారి. ఇదే కేసులో నిన్న ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ వెంటనే అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, భాస్కర్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.