సాయితేజ్ కి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికింది: 'విరూపాక్ష' డైరెక్టర్
- సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
- ఈ నెల 21వ తేదీన సినిమా రిలీజ్
- ఏలూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- సుకుమార్ వల్లనే ఈ సినిమా రేంజ్ పెరిగిందన్న డైరెకర్
సాయితేజ్ హీరోగా 'విరూపాక్ష' సినిమా చేశాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. కథ - స్క్రీన్ ప్లే సుకుమార్ అందించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 'ఏలూరు'లోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించారు.
ఈ వేదికపై దర్శకుడు కార్తీక్ వర్మ దండు మాట్లాడుతూ .. ' విరూపాక్ష' సినిమా ఇక్కడివరకూ రావడానికి కారకుడు సుకుమార్ గారు. ఈ సినిమా ఇంతటి భారీతనాన్ని సంతరించుకోవడానికి కారకుడు కూడా ఆయనే. ఈ సినిమాలో సాయితేజ్ చాలా గొప్పగా చేశాడు. ఈ సినిమాతో ఆయనకి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికిందని భావిస్తున్నాను" అన్నాడు.
"ఈ సినిమా కోసం మేము కష్టపడలేదు .. ఎంజాయ్ చేస్తూ చేశాము. కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్ కర్షన్ కి వెళితే ఎలా ఉంటుందో, ఈ సినిమా షూటింగుకి అంత ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. ఈ సినిమాకి వెళ్లినవారికి తెరపై ఆర్టిస్టులు కాకుండా నేను సృష్టించిన పాత్రలు మాత్రమే కనబడతాయని బలంగా చెప్పగలను" అని చెప్పుకొచ్చాడు.