వివేకా కేసు విషయంలో జగన్ స్పందించాలి: సీపీఐ రామకృష్ణ

  • 2019లో వివేకా హత్య
  • దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
  • భాస్కర్ రెడ్డిని నాలుగేళ్ల తర్వాత అరెస్ట్ చేశారన్న సీపీఐ రామకృష్ణ
గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత కొంతకాలంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. 

వివేకా కేసు విషయంలో సీఎం జగన్ స్పందించాలని అన్నారు. వివేకా కేసులో నాలుగేళ్ల తర్వాత సీబీఐ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిందని తెలిపారు. జగన్ పదేపదే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను కలవడంతో వివేకా కేసు విచారణ మందగించిందని వివరించారు. ఒక కన్ను ఇంకో కన్ను అంటూ అసెంబ్లీలో చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాం అని సీపీఐ రామకృష్ణ వెల్లడించారు. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.


More Telugu News