రోహిత్ శర్మకు అస్వస్థత... ముంబయి ఇండియన్స్ సారథిగా సూర్య
- ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- కడుపునొప్పితో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లతో క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు లభించనుంది. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతడి స్థానంలో ముంబయి ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. టాస్ కు కూడా సూర్యానే వచ్చాడు. రోహిత్ శర్మ బదులు జట్టులోకి డువాన్ జాన్సెన్ వచ్చాడని వివరించాడు.
కాగా, రోహిత్ శర్మ కోలుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగే అవకాశాలున్నాయి.
ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ ఇప్పటిదాకా 3 మ్యాచ్ లు ఆడి 1 విజయం సాధించగా.... కోల్ కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది.