వైఎస్ భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తీసుకువచ్చిన సీబీఐ అధికారులు

  • వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
  • ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
  • పులివెందుల నుంచి కట్టుదిట్టమైన భద్రతతో హైదరాబాద్ తరలింపు
  • కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. సీబీఐ కాన్వాయ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ చేరుకుంది. భాస్కర్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. 

మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని సీబీఐ అధికారులు ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, వైద్య పరీక్షల నిమిత్తం భాస్కర్ రెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.


More Telugu News