శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ ఫోన్లకు అనుమతి పూర్తిగా నిలిపివేత
- శ్రీకాళహస్తి ఆలయంలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడంపై నిషేధం
- రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన పాలకమండలి చైర్మన్
- ఇటీవల కాణిపాకం ఆలయంలో మూలవిరాట్ ను సెల్ ఫోన్ తో చిత్రీకరణ
- ఇలాంటి ఘటనలు నివారించేందుకే శ్రీకాళహస్తిలో సెల్ ఫోన్లపై నిషేధం
రాష్ట్రంలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలోకి సెల్ ఫోన్లతో ప్రవేశించడంపై నిషేధం విధించారు. శ్రీకాళహస్తి ఆలయంలోకి సెల్ ఫోన్ల అనుమతిని పూర్తిగా నిలిపివేసినట్టు ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు.
శ్రీకాళహస్తికి నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారని వెల్లడించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలు తమ సమావేశాల్లో కార్యకర్తలు, ఇతర శ్రేణులకు వివరించాలని సూచించారు.
ఇటీవల కాణిపాకం ఆలయంలో సెల్ ఫోన్లను తీసుకెళ్లి మూల విరాట్ ను చిత్రీకరించారని, ఇలాంటి ఘటనలు శ్రీకాళహస్తి ఆలయంలో చోటుచేసుకోరాదన్న ఉద్దేశంతో సెల్ ఫోన్లపై నిషేధం విధించినట్టు వివరించారు.
ఇప్పటికే ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది సెల్ ఫోన్లు లేకుండానే ఆలయంలోకి వెళుతున్నారని తారక శ్రీనివాసరావు తెలిపారు. భక్తులను కూడా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.