సీనియర్ గాయకుడు మనో ఇప్పుడు డాక్టర్ అయ్యాడు!

  • చిత్ర పరిశ్రమలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న మనో
  • గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించిన వైనం
  • డాక్టరేట్ ప్రదానం చేసిన రిచ్ మండ్ గాబ్రియెల్ యూనివర్సిటీ
పరిచయం అక్కర్లేని ప్రముఖ గాయకుడు... మనో అలియాస్ నాగూర్ బాబు. తొలినాళ్లలో అచ్చం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలా పాడుతున్నాడే అనిపించుకున్న మనో... ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. వేల సంఖ్యలో సినీ, ప్రైవేటు గీతాలు ఆలపించడమే కాదు, నటుడిగానూ, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణించారు. 

కాగా, ఇప్పుడాయన ఘనతలకు గుర్తింపుగా డాక్టరేట్ లభించింది. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ దేశానికి చెందిన రిచ్ మండ్ గాబ్రియెల్ యూనివర్సిటీ గాయకుడు మనోకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని మనో స్వయంగా వెల్లడించారు. 

భారతీయ సినీ పరిశ్రమలో గాయకుడిగా, సంగీతకారుడిగా 38 ఏళ్ల కెరీర్ లో 15 భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడినందుకు తనకు ఈ డాక్టరేట్ ఇచ్చారని వివరించారు. ఈ గౌరవం లభించినందుకు ఆనందంగా ఉందని, తన అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు మనో ట్వీట్ చేశారు.


More Telugu News