ముంబై మహిళల జట్టు జెర్సీతో బరిలోకి దిగనున్న రోహిత్ సేన
- ఈ రోజు వాంఖడేలో కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై పోరు
- అందరికీ విద్య, క్రీడల పేరిట ముంబై యాజమాన్యం ప్రత్యేక చొరవ
- 19 వేల మంది బాలికలకు స్టేడియంలో ఉచిత అనుమతి
ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ సరికొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. ఈ రోజు వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ సేన డబ్ల్యూపీఎల్ లో ముంబై మహిళల జట్టు ధరించిన జెర్సీలను వేసుకొని బరిలోకి దిగనుంది. ముంబై యజమాని నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ చొరవతో ఈ రోజు ఈఎస్ఏ దినోత్సవం (అందరికీ విద్య, క్రీడలు)లో ముంబై జట్టు పాల్గొననుంది.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 19 వేల మంది బాలికలను ఉచితంగా స్టేడియంలో అనుమతించనుంది. యాజమాన్యం తీసుకున్న ఈ చొరవతో బాలికలు క్రీడలను కెరీర్ గా ఎంచుకునేలా ప్రోత్సహిస్తుందని ముంబై పురుషుల జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మహిళల జట్టు బౌలింగ్ కోచ్ ఝులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు.