ఏపీలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

  • ఏపీలో ఈ నెల 3 నుంచి పదో తరగతి పరీక్షలు
  • ఆరు పేపర్లుగా నిర్వహణ
  • పదో తరగతి పరీక్షలు రాసిన 6.11 లక్షల మంది
  • ఈ నెల 19 నుంచి మూల్యాంకనం
ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షలు ఆరు పేపర్లుగా నిర్వహించారు. ఏప్రిల్ 3న పరీక్షలు ప్రారంభం కావడం తెలిసిందే. రాష్ట్రంలో 6.11 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 

ఈ పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలు సజావుగా పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. 

కాగా, పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు.


More Telugu News