60 వేలకు చేరువైన కరోనా యాక్టివ్ కేసులు

  • తాజాగా 10,093 మందికి వైరస్ నిర్ధారణ
  • రోజువారీ పాజిటివిటీ రేటు 5.61 శాతంగా నమోదు
  • 24 గంటల్లో 23 మంది మృతి
దేశంలో కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు కూడా పదివేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,093 మంది వైరస్‌ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,48,18,115కు చేరింది. 

ఇందులో 57,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్ వల్ల తాజాగా 23 మంది మృతిచెందారు. దాంతో, దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,31,114కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.61 శాతానికి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరణాల రేటు 1.19 శాతంగా ఉండగా.. వైరస్ బారిన పడిన వారిలో 98.68 శాతం మంది కోలుకున్నారు.


More Telugu News