వాడు బలవంతుడైతే.. నేను భగవంతుడినిరా.. ఆసక్తికరంగా ‘రుద్రంగి’ ట్రైలర్

  • స్వాతంత్య్ర కాలం నాటి కథగా తెరకెక్కిన రుద్రంగి
  • విచిత్ర హావభావాలతో విలనిజం పండించిన జగపతి బాబు
  • చాలా కాలం తర్వాత తెలుగులోకి మమతా మోహన్ దాస్ రీ ఎంట్రీ
  • సినిమాను నిర్మించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌.. మే 26న రిలీజ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా దూసుకుపోతున్న జగపతి బాబు కీలక పాత్రలో నటించిన సినిమా ‘రుద్రంగి’. యువ నటుడు ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటించిన ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. స్వాతంత్య్ర కాలం నాటి కథగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 

ఇందులో ముఖ్యంగా జగపతి బాబు.. విచిత్ర హావభావాలతో విలనిజం పండించినట్లుగా కనిపిస్తోంది. ‘ఇండిపెండెన్స్.. బానిసలకు కాదు రాజులకు’, ‘గాడు బలవంతుడురా.. కానీ నేను భగవంతుడిని రా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఇక టీజర చివర్లో.. ‘‘అందరు ఎట్ల పుట్టిర్రో.. గాడు అట్లనే పుట్టిండు. వాడిని అత్తరు సీసాలకెళ్లి కన్లే’’ అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్. 

మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై కాస్త మంచి బజ్‌నే క్రియేట్‌ చేశాయి. తాజా టీజర్ లో నోఫెల్‌ రాజా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.



More Telugu News