తిరుమల ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు.. నిలిచిన వాహనాలు. వీడియో ఇదిగో!
- ఏడో మైలు వద్ద తిష్టవేసిన ఏనుగుల గుంపు
- తీవ్ర భయాందోళనకు గురైన శ్రీవారి భక్తులు
- ఏనుగులను అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
ఏడు కొండల వాడిని దర్శించుకోవడానికి వెళుతున్న భక్తులను ఏనుగులు భయాందోళనలకు గురిచేశాయి. ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు ఒకటి తిష్టవేయడంతో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. భక్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ అధికారులు తిరుమల మొదటి ఘాట్ రోడ్ కు చేరుకున్నారు. ఏనుగుల గుంపును తిరిగి అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గుంపులో ఐదు పెద్ద ఏనుగులతో పాటు ఓ గున్న ఏనుగు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఘాట్ రోడ్ పక్కనే ఏనుగుల గుంపు తిష్ట వేయడంతో శ్రీవారి భక్తులు భయాందోళనకు లోనయ్యారు. కొంతమంది భక్తులు తమ ఫోన్లలో ఏనుగుల గుంపును ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కాగా, గత కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లోని ఏనుగులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు.