ఆరెంజ్ క్యాప్ పోటీలో విరాట్ కోహ్లీ
- టాప్ స్కోరర్ జాబితాలో మూడో స్థానానికి చేరిక
- 233 పరుగులతో మొదటి స్థానంలో శిఖర్ ధావన్
- 228 పరుగులతో రెండో స్థానంలో నిలిచిన డేవిడ్ వార్నర్
ఐపీఎల్ 2023 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్న టాప్ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ మరో మెట్టు పైకి ఎక్కాడు. మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉంటే, రెండో స్థానంలో ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ ఉండగా, ఆర్సీబీ సభ్యుడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. 2023 ఐపీఎల్ సీజన్ లో శిఖర్ ధావన్ 233 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 228 పరుగులు చేయగా, కోహ్లీ పేరిట 214 పరుగులు నమోదయ్యాయి.
నాలుగో స్థానంలో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ 204 పరుగులతో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 197 పరుగులతో ఆరెంజ్ క్యాప్ పోటీదారుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆరో స్థానంలో 197 పరుగులతో చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఇక పర్పుల్ క్యాప్ పోటీదారుల్లో లక్నో బౌలర్ మార్క్ వుడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ 10 వికెట్లు, రషీద్ ఖాన్ 9 వికెట్లు, రవి బిష్ణోయ్ 8 వికెట్లు, అర్షదీప్ సింగ్ 8 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.