అన్నమయ్య జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
- పక్షవాతానికి చికిత్స కోసం మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం
- ఘటనా స్థలంలోనే ముగ్గురి మృతి
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లాలో అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మయ్య (65) పక్షవాతంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి కారులో తీసుకెళ్తుండగా, కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు. వారి బంధువు అయిన చిన్నక్క (60) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మరో కారులో ఉన్న ముగ్గురితోపాటు బాలుడు హర్షవర్ధన్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.