యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక
- వాట్సాప్, టెలిగ్రామ్‌లో నకిలీ యాప్ చక్కర్లు కొడుతోందన్న ఐఆర్‌సీటీసీ
- డౌన్‌లోడ్ చేసుకుంటే సైబర్ దాడుల బారిన పడొచ్చని వార్నింగ్
- ఐఆర్‌సీటీసీ అధికారులమని చెప్పుకుంటూ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం తస్కరిస్తారని వెల్లడి
- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచన
ఐఆర్‌సీటీసీ పేరిట వైరల్ అవుతున్న ఓ నకిలీ యాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రజలకు తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. ఐఆర్‌సీటీసీకనెక్ట్ పేరిట ఈ యాప్‌కు సంబంధించిన ఏపీకే ఫైల్ వాట్సాప్, టెలిగ్రామ్‌లో చక్కర్లు కొడుతోందని తెలిపింది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వారి ఫోన్లు సైబర్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ యాప్ ద్వారా నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారం, యూపీఐ, బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లపై ఒత్తిడి తెస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. కాబట్టి.. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని హెచ్చరించింది.