ఢిల్లీ మళ్లీ ఢమాల్... ఇది ఐదోసారి!

  • తీరుమారని ఢిల్లీ క్యాపిటల్స్
  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి
  • వరుసగా ఐదో మ్యాచ్ లోనూ పరాజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో అత్యంత పేలవంగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో ఢిల్లీ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 175 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. 

మనీశ్ పాండే (50) అర్ధసెంచరీతో అలరించినా, కీలక సమయంలో అవుట్ కావడంతో ఛేజింగ్ లో ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. అక్షర్ పటేల్ 21, అమన్ హకీమ్ ఖాన్ 18, నోర్కియా 23 (నాటౌట్) దూకుడుగా ఆడినా, వికెట్లు చేజారడంతో ఢిల్లీ ఢీలాపడింది. 

అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఢిల్లీకి వరుస దెబ్బలు తగిలాయి. రెండు పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీ షా (0), మిచెల్ మార్ష్ (0), యశ్ ధూల్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. కాసేపటికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమిబాటలో పయనించింది. 

బెంగళూరు జట్టులో వైశాఖ్ విజయ్ కుమార్ 3, మహ్మద్ సిరాజ్ 2, వేన్ పార్నెల్ 1, వనిందు హసరంగ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా ఐదో విజయం.

లక్నో సూపర్ జెయింట్స్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ కాగా... రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ గాయంతో బాధపడుతుండడంతో అతడు ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. ధావన్ బదులు ఆల్ రౌండర్ శామ్ కరన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.


More Telugu News