యువగళం పాదయాత్రతో తాడేపల్లి ప్యాలెస్ షేకయిపోయింది: నారా లోకేశ్

  • యువగళం పాదయాత్రలో జగన్‌పై లోకేశ్ విమర్శలు
  • పరదాలు, పోలీసులతో పాలన సాగిస్తున్నారని వ్యాఖ్య
  • పాదయాత్రతో తాడేపల్లి ప్యాలెస్ షేకయిపోతోందని కామెంట్
  • పేదలపై జగన్ కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ మండిపాటు
యువగళం పాదయాత్రతో తాడేపల్లి ప్యాలెస్ షేకయిపోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. నేటి పాదయాత్రలో భాగంగా ఆయన వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. 

‘‘నేను దమ్ము, ధైర్యంతో ప్రజల్లో నడుస్తున్నా. నేను ఎవరికీ భయపడే వాడిని కాదు. వివేకా హత్య కేసులో సీబీఐ కరెక్ట్‌గా దర్యాప్తు చేస్తే అరెస్ట్‌ల లింకులన్నీ తాడేపల్లి కొంపకు వెళ్తాయి. జగనాసుర రక్త చరిత్ర ఇదే. జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం. పేదలపై జగన్‌రెడ్డి కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే లబ్దిదారులకు పెండింగ్‌ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్‌ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’’ అని లోకేశ్‌ ప్రకటించారు. మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరదాలు పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News