జపాన్ ప్రధాని క్షేమంగా ఉన్నారని తెలిసి మనసు కుదుటపడింది..ప్రధాని మోదీ వ్యాఖ్య
- శనివారం జపాన్ ప్రధాని కిషిదాపై స్మోక్ బాంబుతో దాడి
- నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దాడిని ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
జపాన్ ప్రధాని కిషిదాపై స్మోక్ బాంబు దాడిని ఖండిస్తున్నట్టు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పేర్కొన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడినట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
జపాన్ ప్రధాని కిషిదాపై శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. తీర ప్రాంతనగరమైన వకయామాలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కిషిదా ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడి నుంచి ప్రధాని క్షేమంగా బయటపడ్డారు. స్మోక్ బాంబు కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగకమ్ముకోవడంతో కార్యక్రమానికి వచ్చిన వారందరూ తీవ్ర భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని అటూఇటూ పరుగులు తీశారు. అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.