ఇదేమి ఫ్యాక్ట్ చెక్.. అందుకే మిమ్మల్ని హాఫ్ బ్రెయిన్ సన్నాసులు అనేది: అయ్యన్నపాత్రుడు
- 90% వైకల్యం ఉన్న సీమ పర్వీన్ కు పెన్షన్ తీసేయడంపై ఇటీవల నిలదీసిన చంద్రబాబు
- చంద్రబాబు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్న ‘ఏపీ ఫ్యాక్ట్ చెక్’
- అమానవీయంగా పెన్షన్ రద్దు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు రద్దు చేయడం ఖాయమన్న అయ్యన్న
90 శాతం వైకల్యం ఉన్న సీమ పర్వీన్ అనే దివ్యాంగురాలికి పెన్షన్ తీసేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీసిన విషయం తెలిసిందే. విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ పెన్షన్ ను ఎలా తీసేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా సెల్ఫీ చాలెంజ్ విసిరారు. సీమ పర్వీన్ ఫోటోలు, ఇతర పత్రాలు పోస్ట్ చేశారు.
దీనిపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ‘ఫ్యాక్ట్ చెక్’.. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఆమె అనర్హురాలు కావడం వల్లే ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది’’ అంటూ వివరణ ఇచ్చింది.
ఈ ట్వీట్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. ఇదేమి ఫ్యాక్ట్ చెక్ అంటూ మండిపడ్డారు. ‘‘మిమ్మల్ని హాఫ్ బ్రెయిన్ సన్నాసులు అని ఊరికే అనలేదు.. ఇదేమి ఫాక్ట్ చెక్? మేము చెప్పింది అదే కదరా అయ్యా. ఇంట్లో వాళ్లు 300 యూనిట్స్ విద్యుత్ వాడారని, 90 శాతం వైకల్యంతో ఉన్న యువతికి పెన్షన్ తీసేయడం ఏంటి అనేదే మా ప్రశ్న! అమానవీయంగా ఆమె పెన్షన్ రద్దు చేసిన మీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు రద్దు చేయడం ఖాయం’’ అని ట్వీట్ చేశారు.
ఈ ఫ్యాక్ట్ చెక్ పై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘ఆమెకు ఇచ్చేది దివ్యాంగుల పెన్షన్ రా అయ్యా. ఫ్యామిలీ మొత్తం వాడే విద్యుత్ కారణం చూపుతున్నారు. పెన్షన్ అనేది ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఇస్తున్నది కాదు కదా’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘కరెంటు బిల్లు పెరిగితే ఆ అమ్మాయి అంగవైకల్యం పోయిందా??’’ అంటూ నిలదీస్తున్నారు. ‘‘రూ.కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి తాడేపల్లి నుంచి తెనాలికి, తాడేపల్లి నుంచి చిలకలూరిపేటకి ప్రజల డబ్బుతో హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. కాని ఒక దివ్యాంగురాలికి పెన్షన్ ఇవ్వటానికి మాత్రం ఎక్కడ లేని రూల్స్ అడ్డం వస్తాయి’’ అని మరొకరు విమర్శించారు.