టీటీడీ విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు: చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ
  • శ్రీవారి నైవేద్యాలకు ప్రకృతి సాగు ఉత్పత్తులు
  • తిరుమలలో వేసవి రద్దీపై సమీక్షించామన్న వైవీ సుబ్బారెడ్డి
  • అలిపిరి వద్ద గోడౌన్లు, భవనాల ఆధునికీకరణకు రూ.32 కోట్లు
తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ భేటీపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో ఈ వేసవిలో భక్తుల రద్దీపై సమీక్షించామని వెల్లడించారు. శ్రీవారి నైవేద్యాలకు 12 రకాల ప్రకృతి సాగు ఉత్పత్తుల ధరలపై కమిటీ నియామకానికి ఆమోదం తెలిపినట్టు వివరించారు. అలిపిరి వద్ద గోడౌన్లు, భవనాల ఆధునికీకరణకు రూ.32 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి ఆధునికీకరణకు రూ.3 కోట్లకు టెండర్లు పిలుస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.


More Telugu News