సెంచరీ హీరోకి రసగుల్లాలతో ట్రీట్.. ఇదిగో వీడియో!
- కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్
- మ్యాచ్ తర్వాత పార్టీ చేసుకున్న టీమ్ సభ్యులు
- రసగుల్లాలను ఆస్వాదిస్తూ తిన్న ఇంగ్లండ్ బ్యాట్స్ మన్
తొలి మూడు మ్యాచ్ లలో నిరాశపరిచిన సన్ రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్.. నిన్న జరిగిన మ్యాచ్ లో చితక్కొట్టాడు. తన రేటుకు ఏమాత్రం న్యాయం చేయలేక పోతున్నాడన్న విమర్శలను తిప్పికొడుతూ సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే ఈ సీజన్ లో తొలి శతకం సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు
మ్యాచ్ తర్వాత టీమ్ మొత్తం వేడుక చేసుకుంది. జట్టు సభ్యులు హ్యారీ బ్రూక్ ను కేక్ తో ముంచెత్తారు. తర్వాత రసగుల్లా ట్రీట్ ఇచ్చారు. చిన్న బేసిన్ లో ఉన్న రసగుల్లాలను ఆస్వాదిస్తూ తిన్నాడు హ్యారీ బ్రూక్. ఇందుకు సంబంధించిన వీడియోను సన రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. స్వీట్ డ్రీమ్స్ అని క్యాప్షన్ ఇచ్చింది.
ఐపీఎల్ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాళ్లలో హ్యారీ బ్రూక్ ఒకడు. ఈ ఇంగ్లండ్ యువ ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగా అతడు ఆడటం లేదని విమర్శలు వచ్చాయి. తొలి మూడు మ్యాచ్ లలో13, 3, 13 చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తాయి. ‘ఇది పీఎస్ఎల్ కాదు బాబూ’ అంటూ కొందరు ఎగతాళి చేశారు. సెంచరీతో వాటన్నింటికీ సమాధానం చెప్పాడు.