అంబేద్కర్ కు టీడీపీ, వైసీపీ గౌరవం ఇవ్వలేదు: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

  • అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశం గర్వించేలా కేసీఆర్ చేశారన్న తోట
  • విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి టీడీపీ, వైసీపీ మాట తప్పాయని విమర్శ
  • కేసీఆర్ ను చూసి జగన్, చంద్రబాబు నేర్చుకోవాలని సూచన
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత గౌరవం టీడీపీ, వైసీపీలకు లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి యావత్ దేశం గర్వపడేలా కేసీఆర్ చేశారని చెప్పారు. కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 

అమరావతి ప్రాంతంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం చెప్పి, ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిందని, నాలుగేండ్లు గడుస్తున్నా దాని ఊసే లేదని అన్నారు. అంబేద్కర్ ను ఏపీ పాలకులు గౌరవించడం లేదని విమర్శించారు. జగన్, చంద్రబాబులు కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని సూచించారు. 



More Telugu News