తెలంగాణలో ఆ జిల్లాలకు నేడు, రేపు ఎల్లో అలర్ట్

  • పలు జిల్లాల్లో రెండు రోజులు వడగళ్ల వర్షం కురుస్తుందని అంచనా
  • అదే సమయంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • రాష్ట్రంలో అనూహ్యంగా  మారుతున్న వాతావరణం
తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. మొన్నటిదాకా ఎండలు పెరుగుతూ ఉండగా.. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

అదే సమయంలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.


More Telugu News