గుజరాత్ లో ఆప్ కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన సూరత్ కౌన్సిలర్లు

  • 2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో 27 స్థానాలను గెలుచుకున్న ఆప్
  • తాజాగా బీజేపీలో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు
  • ఇంతకు ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు కౌన్సిలర్లు
ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ లో షాక్ తలిగింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీల సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. 

2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 స్థానాలను గెలుచుకుని ఔరా అనిపించింది. ఈ విజయంతో గుజరాత్ లో అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి సూరత్ లో 17 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఇంతకు ముందే నలుగురు కార్పొరేటర్లు బీజేపీ గూటికి చేరారు. మొత్తం 120 సీట్లలో బీజేపీ 93 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ నుంచి 10 మంది చేరడంతో... బీజేపీ బలం 103కి చేరుకుంది.


More Telugu News