వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
- ఈ ఉదయం ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్
- కడప నుంచి హైదరాబాద్ తరలింపు
- సీబీఐ న్యాయస్థానంలో హాజరు
- చంచల్ గూడ జైలుకు తరలించిన సీబీఐ అధికారులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇవాళ అరెస్ట్ చేసిన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఉదయం అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వివేకా హత్య తర్వాత అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కుమార్ ది కీలకపాత్ర అని భావిస్తున్నారు. అతడిని విచారించి మరింత సమాచారం రాబట్టే ఉద్దేశంతోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఉదయ్ కుమార్ రెడ్డిని తొలుత పులివెందుల నుంచి కడప జైలు గెస్ట్ హౌస్ కు తరలించి విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి, ఉదయ్ కుమార్ రెడ్డిని కడప నుంచి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు.
కాగా, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ, అరెస్ట్ ను అధికారికంగా చూపించలేదని సమాచారం.