ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు
- ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం
- విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు
- ఆదివారం సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
- తమపై కేంద్రం ఒత్తిడి పెంచుతోందంటూ ఆప్ ఆరోపణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆదివారం ఆయనను సీబీఐ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.
ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు నేతలు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. తమ పార్టీకి జాతీయ హోదా వచ్చాక కేంద్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి పెంచుతోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇక సీబీఐ నోటీసులపై ఆప్ మరికాసేపట్లో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.