మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా
- 'రైటర్స్ బ్లాక్' షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ అందించిన అకీరా నందన్
- రైటర్ సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో షార్ట్ ఫిల్మ్
- అకీరా మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉందంటూ అడివి శేష్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. పవన్, రేణు దేశాయ్ ల 19 ఏళ్ల కుమారుడు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'రైటర్స్ బ్లాక్' షార్ట్ ఫిల్మ్ కు అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.
ఒక రచయిత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు, వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అభిలాష్ సుంకర, మనోజ్ రిషి ప్రధాన పాత్రలను పోషించారు. ఫణి మాధవ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ స్పందిస్తూ.. అకీరా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ లింక్ ను షేర్ చేస్తూ, టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అకీరా మ్యూజిక్ అందించడం తనకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.
మరోవైపు పలువురు మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకీరా హీరో అవుతాడనుకుంటే... మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ... తనకు ఇష్టమైన విభాగాన్ని ఎంచుకున్నాడని, ప్రొఫెషన్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.