ఇండియాలో ఒక్క రోజులోనే 30 శాతం పెరిగిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 11,109 మందికి కరోనా పాజిటివ్
- ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న 6,456 మంది రోగులు
- 98.70 శాతంగా ఉన్న రోజువారీ రికవరీ రేటు
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళనను పెంచుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,109 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 7,830 కేసులు నమోదు కాగా... మరుసటి రోజే కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. ఒక్క రోజులోనే దాదాపు 30 శాతం కేసులు పెరిగాయి. తాజా కేసులతో కలిపి దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 6,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,42,16,583 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది.
నిన్న 467 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు వేసిన కరోనా డోసుల సంఖ్య 220.66 కోట్లకు చేరుకుంది. 95.21 కోట్ల సెకండ్ డోసులు, 22.87 కోట్ల ప్రికాషన్ డోసులు వేశారు.
నిన్న 467 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు వేసిన కరోనా డోసుల సంఖ్య 220.66 కోట్లకు చేరుకుంది. 95.21 కోట్ల సెకండ్ డోసులు, 22.87 కోట్ల ప్రికాషన్ డోసులు వేశారు.