కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తత్వానికి అంబేద్కర్ జీవితమే నిదర్శనం: కేసీఆర్

  • అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేసీఆర్
  • ఎంత కష్టమైన ప్రయాణమైనా.. చిత్తశుద్ధితో సాగితే గమ్యాన్ని చేరుకోవచ్చని వ్యాఖ్య
  • 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న తెలంగాణ సీఎం
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా.. దేశ గమనాన్ని మార్చడంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. శుక్రవారం ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్లు చేసింది. 

‘‘ఏ ప్రయాణమైనా, ఎంత కష్టమైనా, ఎంత సుదీర్ఘమైనదైనా సరే.. చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో సాగితే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తత్వానికి అంబేద్కర్ జీవితమే నిదర్శనం’’ అని కేసీఆర్ పేర్కొన్నట్టు సీఎంవో ట్వీట్ చేసింది.

మరోవైపు ట్యాంక్ బండ్ తీరంలో నిర్మించిన 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. తొలుత శిలాఫలకం ఆవిష్కరించి, తర్వాత ఆడిటోరియం ప్రధాన భవనాన్ని ప్రారంభిస్తారు. విగ్రహావిష్కరణ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.


More Telugu News