విజయ్ దేవరకొండ ఎమోషనల్ లెటర్ పై సమంత స్పందన

  • శాకుంతలం చిత్రంలో నటించిన సమంత
  • ఏప్రిల్ 14న విడుదల అవుతున్న శాకుంతలం
  • విషెస్ తెలిపిన విజయ్ దేవరకొండ
  • థాంక్యూ మై హీరో అంటూ సమంత రిప్లై
  • ఖుషీ చిత్రంలో కలిసి నటిస్తున్న విజయ్ దేవరకొండ, సమంత
సమంత ప్రధానపాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం రేపు (ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఓ ఎమోషనల్ లెటర్ తో సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. 

"సమంతా... నువ్వు ఎప్పుడు ఇతరుల పట్ల ప్రేమతో మెలుగుతావు. ఎంతో ఉత్సాహంగా ఉంటావు. సినిమాలే జీవితం అని నమ్ముతావు. అందుకే అనారోగ్యం వేధిస్తున్నా, విశ్రాంతి తప్పనిసరి అయినా ఫ్యాన్స్ కోసం, సినిమాల కోసం చిరునవ్వుతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తావు. రేపు నీ చిత్రం శాకుంతలం విడుదల కాబోతోంది... ఈ సందర్భంగా నీకు శుభాకాంక్షలు. లక్షలాది ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నీకు అండగా ఉంటాయి. గత ఏడాది కాలంగా సమంత ఒక ఫైటర్ లా ఎలాంటి పోరాటం చేస్తోందో మిగతా ప్రపంచానికి తెలియకపోవచ్చు" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 

అందుకు సమంత బదులిస్తూ, థాంక్యూ మై హీరో అంటూ కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ లేఖ పట్ల ఏం చెప్పాలో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలే అవసరం అని పేర్కొన్నారు. కాగా, ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News