తన యూజర్లకు చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకురానున్న మైక్రోసాఫ్ట్

  • టెక్ రంగంలో నయా సంచలనం
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపుదిద్దుకున్న చాట్ జీపీటీ
  • సెర్చ్ ఇంజిన్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళుతోన్న ఏఐ చాట్ బాట్
టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్ జీపీటీ నామస్మరణ జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విశేషస్థాయిలో ఉపయోగించుకుని, సెర్చ్ ఇంజిన్ అనుభవాన్ని అద్భుతం అనదగ్గ రీతిలో ఆవిష్కరించింది చాట్ జీపీటీ.

అదీ, ఇదీ అని తేడా లేకుండా ఏ అంశంపై అయినా చాట్ జీపీటీ సెర్చ్ రిజల్ట్స్ అందించడమే కాదు, స్వయంగా విశ్లేషణలు, సూచనలు ఇవ్వగలిగిన టెక్ ఫ్రెండ్ గా చాట్ జీపీటీ గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించింది. ఇది మైక్రోసాఫ్ట్ భాగస్వామ్య సంస్థ. 

కాగా, త్వరలోనే తన డెస్క్ టాప్ యూజర్లకు చాట్ జీపీటీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. తన బింగ్ సెర్చ్ ఇంజిన్ లో, విండోస్10, విండోస్11 సెర్చ్ బార్ లో, ఎడ్జ్ బ్రౌజర్ లో, మైక్రోసాఫ్ట్ 365 కాపిలాట్ ఆఫీస్ యాప్స్ లోనూ చాట్ జీపీటీని కూడా పొందుపరచనుంది. తన ఓపెన్ సోర్స్ టూల్ పవర్ టాయ్స్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టనుంది.


More Telugu News