విశాఖ ఉక్కు గురించి మాట్లాడింది మేమే... ఏపీ ప్రభుత్వం, విపక్షం నోరు విప్పలేదు: హరీశ్ రావు

  • విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత
  • అమ్మబోమని... బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటన
  • కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న హరీశ్ రావు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికి లేనట్టేనని కేంద్రం ప్రకటనతో వెల్లడైంది. దీనిపై బీఆర్ఎస్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం నిర్ణయం మార్చుకుందని వారు అంటున్నారు. తాజాగా, ఇదే అంశంపై మంత్రి హరీశ్ రావు కూడా మాట్లాడారు.

కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మబోవడంలేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీశ్ రావు వెల్లడించారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం... ఇది బీఆర్ఎస్ విజయం... ఇది ఏపీ ప్రజల విజయం... ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు. 

విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడామని వివరించారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడిందని వెల్లడించారు. కానీ, విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని హరీశ్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని అన్నారు.


More Telugu News