అమ్మ ఒట్టు వేయించుకోవడం వల్లనే నటించడం మానేశాను: పరుచూరి గోపాలకృష్ణ
- తన కెరియర్ గురించి ప్రస్తావించిన పరుచూరి గోపాలకృష్ణ
- ఒక దశలో నటుడిగా బిజీ అయ్యానని వెల్లడి
- అన్నయ్య ఒక్కడే ఇబ్బంది పడ్డాడని వ్యాఖ్య
- అమ్మ చూడలేకపోయిందని వివరణ
రచయితగా .. నటుడిగా పరుచూరి గోపాలకృష్ణకి అపారమైన అనుభవం ఉంది. డైలాగ్స్ రాయడంలోను .. చెప్పడంలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది. అలాంటి గోపాలకృష్ణ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. అప్పట్లో నేను కొన్ని సినిమాల్లో నటిస్తూ వెళ్లాను .. ఆ తరువాత మానేశాను .. అందుకు కారణం మా అమ్మగారు" అన్నారు.
"నేను నటించవద్దని మా అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి రాస్తూ వచ్చారు. నువ్వు వేషాలు వేయడానికి వెళితే పెద్దాడు ఒక్కడే రాసుకోలేక చాలా కష్టపడుతున్నాడు. వాడి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను" అన్నారు. 1985 .. 86 .. 87 సంవత్సరాలలో నటుడిగా నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయంలో ఆమె ఆ మాట అన్నారు" అని చెప్పారు.
"నిజంగానే నేను నటన వైపు వెళ్లడం వలన అన్నయ్యకి ఇబ్బంది అయింది. రాత్రివేళలో కూడా అలా రాస్తూ కూర్చునేవాడు. అది మా అమ్మగారికి బాధను కలిగించింది. అందుకే అలా ఒట్టు వేయించుకుంది. అమ్మ మాట .. అమ్మ ఒట్టు .. అందుకే అప్పటి నుంచి నటించడం మానేశాను" అన్నారు. ప్రస్తుతం అన్నయ్య రెస్టు తీసుకుంటున్నాడు. నేను మాత్రమే సినిమాలకి రాసి సింగిల్ కార్డు వేయించుకోవడం నాకు ఇష్టంలేదు" అని చెప్పుకొచ్చారు.