బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి: హరీశ్ రావుపై బొత్స ఫైర్
- ఏపీ అభివృద్ధిపై మాట్లాడేందుకు ఆయనెవరన్న బొత్స
- ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలంటూ హరీశ్‌రావుకు హితవు
- ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసన్న ఏపీ మంత్రి
తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఆయనెవరని ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడతారో, ఎవరు మాట్లాడరో తమకు తెలుసన్నారు. వారు ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలని, చరిత్ర మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసని, ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారో హరీశ్‌రావునే అడగాలని విలేకరులకు సూచించారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది. దీనికితోడు హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏపీ ప్రజలు సొంతం రాష్ట్రంలో ఓటు హక్కు వదులుకుని తెలంగాణలో తీసుకోవాలని కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. దీనికి హరీశ్ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.