ఈ ముర్రాజాతి దున్న ‘షెహన్‌షా’ ఖరీదు రూ. 25 కోట్లు.. ఆదాయం నెలకు రూ. 9.60 లక్షలు!
- ముర్రాజాతి దున్నల వీర్యానికి దేశవిదేశాల్లో డిమాండ్
- ‘షెహన్‌షా’ కోసం ప్రత్యేకంగా ఈతకొలను
- ఓ చాంపియన్‌షిప్‌లో రూ. 30 లక్షలు గెలుచుకున్న దున్న
హర్యానాలోని పానిపట్ జిల్లా దిద్వాడి గ్రామానికి చెందిన ఓ రైతు వద్దనున్న ముర్రాజాతి దున్నపోతు ధర ఏకంగా రూ. 25 కోట్లు. ‘షెహన్‌షా’ అని పిలుచుకునే ఈ దున్న నెలకు రూ. 9.60 లక్షలు సంపాదిస్తోంది. నరేంద్రసింగ్ అనే రైతు పెంచుకుంటున్న ఈ మేలురకం దున్న వయసు పదేళ్లు. ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవున్న ‘షెహన్‌షా’ వీర్యానికి దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.
దాని వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ. 300 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దీనిని మార్కెట్లో విక్రయిస్తారు. అలా ప్రతినెలా దాని వీర్యాన్ని విక్రయించడం ద్వారా నెలకు రూ. 9.60 లక్షల ఆదాయం లభిస్తోంది.
నరేంద్రసింద్ తన ‘షెహన్‌షా’ కోసం ప్రత్యేకంగా ఈతకొలను కట్టించాడు. అంతేకాదు, వివిధ పోటీల్లో ఈ ముర్రాజాతి దున్న విజేతగానూ నిలిచి బహుమతులు అందుకుంది. ఓ చాంపియన్‌షిప్‌లో రూ. 30 లక్షలు సొంతం చేసుకుంది. హర్యానాలోని కర్నాల్ నగరం ముర్రాజాతి దున్నపోతులకు ప్రసిద్ధి. వీటిని అక్కడ ‘నల్లబంగారం’గా పిలుస్తారు.